‘మాచర్ల’ నుంచి నితిన్ ఫస్ట్ అటాక్ కి సెన్సేషనల్ రెస్పాన్స్.!

Published on Mar 31, 2022 2:00 pm IST

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మాస్ చిత్రం “మాచర్ల నియోజకవర్గం”. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ డ్రామా అనౌన్సమెంట్ తోనే క్రేజీ అంచనాలు నెలకొల్పుకుంది. ఇక లేటెస్ట్ గా అయితే నితిన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ మాసివ్ గ్లింప్స్ ని రిలీజ్ చెయ్యగా ఇప్పుడు దానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

మన టాలీవుడ్ లోనే అత్యధిక వ్యూస్ సాధించిన రెండో సినిమాగా ఈ చిత్రం 9 మిలియన్ వ్యూస్ కి పైగా అందుకొని రికార్డు సెట్ చేసింది. మొత్తానికి అయితే ఈ మాస్ అటాక్ తో ఈ సినిమాపై హైప్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా శ్రేష్ట్ మూవీస్ వారు నిర్మాణం వహించారు. అలాగే జూలై 8 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :