“రామారావు ఆన్ డ్యూటీ” ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్.!

Published on Jul 17, 2022 10:04 am IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో నూతన దర్శకుడు శరత్ మండవ తో చేసిన చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ” కూడా ఒకటి, రవితేజ నుంచి వస్తున్న మరో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ఇది కాగా అంచనాలు రీచ్ అయ్యేలా ఉండే మాస్ ట్రైలర్ ని మేకర్స్ నిన్న రాత్రి రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ చేయడంతోనే మాసివ్ రెస్పాన్స్ ని అందుకుంటుంది.

మరి లేటెస్ట్ గా అయితే ఈ ట్రైలర్ కేవలం 12 గంటల్లో 9 మిలియన్ కి పైగా భారీ వ్యూస్ రియల్ టైం లో అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో సినిమా కోసం మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుండగా సామ్ సి ఎస్ సంగీతం అందించాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించిన ఈ చిత్రం ఈ జూలై 29న రిలీజ్ కాబోతుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :