హిందీలో “వారియర్” కి సెన్సేషనల్ రెస్పాన్స్.!

Published on Nov 29, 2022 3:05 pm IST

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా తమిళ మాస్ దర్శకుడు ఎన్ లింగుసామి తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “వారియర్”. తెలుగు మరియు తమిళ్ లో ఏకకాలంలో తెరకెకెక్కించిన ఈ చిత్రం థియేటర్స్ లో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది.

కానీ ఫైనల్ గా మాత్రం అనుకున్న రేంజ్ విజయాన్ని సాధించలేకపోయింది కానీ టీవీ మరియు ఇతర స్మాల్ స్క్రీన్స్ పై సూపర్ రెస్పాన్స్ ని ఈ చిత్రం అందుకుంటూ దూసుకెళ్తుంది. ఇక లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం హిందీ వెర్షన్ ని యూట్యూబ్ లో రిలీజ్ చెయ్యగా దీనికి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.

ఇక లేటెస్ట్ గా అయితే హిందీలో వారియర్ ఏకంగా 50 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి రామ్ ఖాతాలో మరో 1 మిలియన్ లైక్డ్ వీడియోగా కూడా నిలిచింది. మొత్తానికి అయితే వారియర్ ఈ రకంగా సాలిడ్ సక్సెస్ ని ఈ చిత్రం అందుకుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :