వాయిదా పడిన సైరా సెకండ్ షెడ్యూల్ !
Published on Mar 9, 2018 2:51 pm IST

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’ రెండో షెడ్యూల్ ఈ నెలలో ప్రారంభం అవ్వాలి కాని కొన్ని అనివార్య కారణాలవల్ల అది కాస్త వచ్చే నెల మొదటి వారానికి వాయిదాపడినట్లు సమాచారం. అమితాబ్ ఈ సినిమాలో చిరంజీవి గురువు పాత్రలో కనిపిచబోతున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీలో చరణ్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్నారు.

నయనతార హీరోయిన్ గా నటించే ఈ సినిమా కు బుర్రా సాయి మాధవ్, పరుచూరి బ్రదర్స్ మాటలు రాస్తున్నారు. నరసింహారెడ్డి లాంటి గొప్ప నాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి.

 
Like us on Facebook