థార్ నోట షారుక్ ఖాన్ హిట్ మూవీ డైలాగ్

Published on Feb 26, 2020 11:25 pm IST

హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మర్వెల్ సూపర్ హీరోస్ లో ఒకరైన థార్ పాత్ర దారి స్పానిష్ నటుడు క్రిస్ హెమ్స్ వర్త్ షారుక్ డైలాగ్ చెప్పి ఆశ్చర్య పరిచాడు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ కొరకు బ్యాంకాక్ వచ్చిన హెమ్స్ వర్త్ ఓ అభిమాని కోరిక మేరకు షారుక్ డైలాగ్ చెప్పారు. షారుక్, కాజోల్ ఆల్ టైం క్లాసిక్ హిట్ గా ఉన్న దిల్ వాలే దుల్హనియా లేజాయింగే సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘బడే బడే దేశోమే చోటే చోటే భాతే హోతే రహితే హై’ డైలాగ్ క్రిస్ హెమ్స్ వర్త్ చెప్పారు.

ఇండియా టూర్ కి వచ్చిన ట్రంప్ సైతం ఈ చిత్రం గురించి షారుక్ ఖాన్ గురించి ప్రస్తావించాడు. 1995లో దర్శకుడు ఆదిత్య చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రం ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా ఉంది. ముంబై మరాఠా మందిర్ థియేటర్ లో ఈ చిత్రం 1000 వరాలు అనగా 19సంవత్సరాలు నిరవధికంగా ఆడించింది.

సంబంధిత సమాచారం :