ఆ హీరో 56 కోట్లతో ఫ్లాట్ కొన్నారట.

Published on Aug 30, 2019 2:00 am IST

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ముంబైలోని ఓ ప్రాంతంలో ఓ ఖరీదైన ప్లాటు కొన్నారట. దాని ధర అక్షరాలా 56 కోట్ల రూపాయలట. ముంబైలోని ఓర్లి ప్రాంతంలో గల ధనిక వర్గం నివాసం ఉండే ప్రాంతంలో షాహిద్ రెండు ప్లాట్స్ కొన్నారట. 8625 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్స్ నందు 10 కార్లు పార్క్ చేసుకోవడానికి సరిపడా విశాలమైన ప్రదేశంతో పాటు, అధునాతన సౌకర్యాలు కలవట. ఇక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఆ బహుళ అంతస్థుల సముదాయం త్వరలో పూర్తికానుంది సమాచారం.

ఇక షాహిద్ కపూర్ ఇటీవల విడుదలైన కబీర్ సింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం ఏకంగా 275కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఈ ఏడాదికి హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. కబీర్ సింగ్ తెలుగు అర్జున్ రెడ్డి చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :