‘శ్యామ్ సింగరాయ్’ డైరెక్టర్ తో షాహిద్ కపూర్ ?

Published on Feb 7, 2022 7:05 am IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాంతో, శ్యామ్‌ సింగరాయ్‌ డైరెక్టర్‌ తో చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వినిపించాయి. కాగా తాజాగా మరో రూమర్ కూడా వినిపిస్తోంది. రాహుల్ సాంకృత్యన్ తన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది.

రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ సినిమా చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాని షాహిద్ ఆల్ రెడీ చూశాడని.. సినిమా తనకు బాగా నచ్చింది అని, అందుకే.. షాహిద్ వెంటనే రాహుల్ సాంకృత్యన్ కి డేట్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ గౌతమ్‌ తిన్ననూరితో షాహిద్ జెర్సీ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఇప్పుడు శ్యామ్‌సింగరాయ్‌ సినిమాను కూడా రీమేక్ చేస్తే బాగుంటుంది.

సంబంధిత సమాచారం :