శంకర్ ‘భారతీయుడు 2’లో కూడా వారిని కొనసాగించనున్నాడు !

Published on Sep 11, 2018 3:21 am IST

స్టార్ హీరో కమల్ హాసన్, శంకర్ కలయికలో సూపర్ హిట్ చిత్రం ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ గా ‘భారతీయుడు 2’చిత్రం తెరకెక్కనుందని తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ కోసం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని కడప లో లొకేషన్స్ ను వెతికే పనిలో పడ్డారు దర్శకుడు శంకర్.

ఇక మొదటి పార్ట్ లో ముఖ్య పాత్ర పోషించిన నటుడు నేడుముడి వేణు ఈచిత్రంలో కూడా నటించనున్నారు. అలాగే ఆయనతో పాటు సుకన్య , గౌండమని సెంథిల్ లను కూడా వారి పాత్రల్లో కొనసాగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించనున్నాడు. ఫస్ట్ పార్ట్ లోలాగే కమల్ ఈ సినిమాలో కూడా డ్యూయల్ రోల్ లో నటించనునున్నాడట. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ ను తీసుకోవాలని భావిస్తున్నారట శంకర్. ఈ చిత్రం డిసెంబర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :