ప్రమాదం పై శంకర్ ఎమోషనల్ కామెంట్స్ !

Published on Feb 26, 2020 6:06 pm IST

స్టార్ డైరెక్టర్ శంకర్ – గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ ల కాంబినేషన్ లో వస్తోన్న ‘భారతీయుడు 2’ సెట్లో తీవ్ర దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈవీపీ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్న ప్రదేశంలో పెద్ద క్రేన్ పడి శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు చిత్రబృందంలోని మరో ఇద్దరు సభ్యులు కూడా చనిపోయారు. ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్శకనిర్మాతలతో పాటు కమల్ హాసన్ కి కూడా నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే ఈ ప్రమాదం పై దర్యాప్తు కోసం ప్రత్యేక అధికారిని కూడా నియమించారు.

కాగా తాజాగా ఈ బాధాకరమైన సంఘటన గురించి శంకర్ ట్విటర్ వేదికగా ఎమోషనల్ గా స్పందించారు. శంకర్ ట్వీట్ చేస్తూ.. ‘ఈ ట్వీట్ తీవ్ర దుఃఖం నిండిన హృదయంతో చేస్తున్నాను. ఆ తీవ్ర దిగ్భ్రాంతికరమైన ప్రమాదం జరిగినప్పటి నుంచి నేను షాక్‌ లోనే ఉండిపోయాను. నా అసిస్టెంట్ డైరక్టర్ తో పాటు మా చిత్రబృందంలోని సభ్యులను కోల్పోయినందుకు నిద్రలేని రాత్రులు గడిపాను. నేను ఈ ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకున్నాను. కానీ ఆ క్రేన్ నా మీద పడినా బావుండేదేమో. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని శంకర్ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :

X
More