బజ్: షారుఖ్ “పఠాన్” డిజిటల్ ప్రీమియర్ అప్పుడే!?

బజ్: షారుఖ్ “పఠాన్” డిజిటల్ ప్రీమియర్ అప్పుడే!?

Published on Jan 19, 2023 4:00 PM IST

కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ తన రాబోయే బిగ్గీ పఠాన్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ హెల్మ్ చేసిన ఈ స్పై థ్రిల్లర్ వచ్చే బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో దీపికా పదుకొణే కథానాయికగా నటించింది. పఠాన్ ఏప్రిల్ 25, 2023న డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది అని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కేసు సందర్భం గా పఠాన్ మేకర్స్ కోర్టులో అధికారికంగా తేదీని వెల్లడించారని పుకారు ఉంది.

తాజా సమాచారం ఏమిటంటే, ఈ చిత్రం మొదటగా రెంట్ ప్రాతిపదికన అమెజాన్ ప్రైమ్ వీడియో లో మార్చి 25, 2023న అందుబాటులో ఉంటుంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన పఠాన్ చిత్రానికి విశాల్ మరియు షేఖర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు