శర్వానంద్ కొత్త సినిమా వివరాలు !

‘మాహానుభావుడు’ సినిమా తరువాత శర్వానంద్ హను రాఘవపూడి, సుదీర్ వర్మ సినిమాలు చెయ్యడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమాలతో పాటు ‘దండుపాళ్యం’ సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీనివాస్ డైర్క్షన్లో మరో సినిమా ఒప్పుకున్నాడు ఈ హీరో. ఏకే.ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ఈ సినిమా నిర్మిచబడుతుంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ‘దండుపాళ్యం’ సినిమా పార్ట్ 1 ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలుసు. త్వరలో ‘దండుపాళ్యం’ సినిమా పార్ట్ 3 విడుదలకానుంది. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎవరు చెప్పినా సినిమా చెయ్యడానికి ఒప్పుకొనే శర్వానంద్ ఈ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.