ఆపదలో ఉన్న రైతును ఆదుకున్న శేఖర్‌ కమ్ముల..!

ఆపదలో ఉన్న రైతును ఆదుకున్న శేఖర్‌ కమ్ముల..!

Published on Oct 26, 2021 11:56 PM IST


ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్, దర్శకుడు శేఖర్ కమ్ముల ఆపదలో ఉన్న ఓ రైతును ఆదుకుని పెద్ద మనసు చాటుకున్నాడు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన కప్పల లక్ష్మయ్య అనే రైతు పూరిల్లు ఈ నెల 21న అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. ఇటీవల ఆ రైతు పొలాన్ని అమ్మి ఇల్లు కట్టుకుందామని బీరువాలో దాచిన రూ.6 లక్షల రూపాయలు కూడా ఈ ఘటనలో పూర్తిగా కాలిపోయాయి.

దీంతో దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడ్డ ఆ రైతును దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఆర్థికంగా ఆదుకున్నారు. రైతు కుటుంబంతో మాట్లాడిన ఆయన అండగా ఉంటానని హామీ ఇచ్చి నేరుగా ఆ రైతు బ్యాంక్ ఖాతాకు లక్ష రూపాయలను పంపించారు. గతేడాది కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు కూడా శేఖర్ కమ్ముల తన వంతు సాయం అందించి గొప్ప మనసు చాటుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు