ఇంటర్వ్యూ : శివాని సింగ్ – మహేష్ బాబుతో సినిమా చేయాలని ఉంది
Published on Mar 7, 2018 3:16 pm IST

విజయ్ దేవరకొండ, శివాని జంటగా నటించిన చిత్రం ‘ఏ మంత్రం వేశావే’. శ్రీధర్ మర్రి డైరెక్ట్ చేసియాన్ ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా హీరోయిన్ శివాని మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం.

ప్ర) మీ నైపథ్యం ఏమిటి ?
జ) మా కుటుంబానికి అసలు సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. అమ్మ, నాన్న ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటారు. నాకు మోడలింగ్ అంటే ఇష్టం. అక్కడి నుండే సినిమాల్లోకి వచ్చాను.

ప్ర) మోడలింగ్ చేస్తున్న మీకు సినిమాల్లోకి రావాలని ఎందుకనిపించింది ?
జ) మోడలింగ్ చేస్తున్నప్పుడు సినిమాల్లో నటించగలనని రియలైజ్ అయ్యాను. అప్పటి నుండి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను.

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర ఏమిటి ?
జ) ఇందులో నా పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల అమ్మాయిగా కనిపిస్తాను. అదే విధంగా పాత్రలో ఒక సెన్సిటివిటీ కూడ ఉంటుంది.

ప్ర) ఈ సినిమా మీ కెరీర్ కు ఉపయోగపడుతుందని భావిస్తున్నారా ?
జ) హెల్ప్ అవుతుందా లేదా అనే విషయాన్నీ నేను చెప్పలేను. కానీ ఓక్ మంచి సినిమా చేశానని మాత్రం చెప్పగలను.

ప్ర) విజయ్ దేవరకొండలో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) చాలా బాగుంది. విజయ్ సెట్స్ లో చాలా సరదాగా ఉంటాడు. చాలా మంచివాడు. అతనితో వర్క్ చేయాడాన్ని ఎంజాయ్ చేశాను.

ప్ర) మీకు తెలుగు అస్సలు రాదు కదా ఎలా మేనేజ్ చేశారు ?
జ) నా టీమ్ మొత్తం నాకు హెల్ప్ చేసింది. ముందుగా డైలాగ్స్ ను హిందీలో రాసుకుని, ఆ టర్ వట ఇంగ్లీష్ లో రాసుకుని చెప్పేదాన్ని. దర్శకుడు శ్రీధర్ మర్రి ప్రతి డైలాగ్ నాకు అర్థమయ్యేలా వివరించేవారు.

ప్ర) సినిమా ఆలాస్యమవడం వలన ఇబ్బంది అనిపించలేదా ?
జ) లేదు.. నా షూటింగ్ 2015 లో మొదలైంది. 2017లో ప్యాచ్ వర్క్ జరిగింది. ఏవో చిన్న చిన్న కారణాల వలన సినిమా వాయిదాపడుతూ వచ్చింది.

ప్ర) తెలుగులో ఏ హీరోతో సినిమా చేయాలనుంది ?
జ) నా ఫెవరెట్ హీరో మహేష్ బాబు. చాలా సింపుల్ గా ఉంటారు. ఆయనతో సినిమా చేయాలని ఉంది.

ప్ర) తెలుగులో కొత్త సినిమాలేవైనా సైన్ చేశారా ?
జ) కొన్ని స్క్రిప్ట్స్ చర్చల దశలోనే ఉన్నాయి. ఇంకా వేటికీ సైన్ చేయలేదు.

 
Like us on Facebook