ఎఫ్ 2 షూటింగ్ అప్ డేట్ !

Published on Jul 7, 2018 9:05 am IST

హ్యాట్రిక్ విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , యువ హీరో వరుణ్ తేజ్ కలయికలో తెరకెక్కుతున్న మల్టీ స్టాటర్ చిత్రం ‘ఎఫ్ 2’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బోరబండ లోని విజేత థియేటర్లో జరుగుతుంది. వరుణ్ తేజ్ మరియు మిగితా నటీనటుల ఫై కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 21 వరకు జరుగనున్న ఈ షెడ్యూల్ లో వెంకీ కూడా షూటింగ్లో పాల్గొననున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత ‘దిల్ రాజు’ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా , మెహ్రీన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :