‘సలార్’ ఇంటర్వెల్ ప్లాన్ చేస్తున్నారు !

Published on Jul 19, 2021 4:00 pm IST

క్రేజీ యాక్షన్ డైరెక్టర్ ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అంటూ మరో పాన్ ఇండియా మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్స్ లో షూట్ చేయడానికి ప్రశాంత్ నీల్ రెడీ అయ్యాడు. ఈ షెడ్యూల్ లో కొన్ని సోలో షాట్స్ తో పాటు ఇంటర్వెల్ సీక్వెన్స్ షూట్ చేయాలని ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 14, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అన్నట్టు సలార్ కథలో వాణి కపూర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని టాక్. ఇక వాణీ కపూర్ ఎప్పుడో ఆ మధ్య నాని నటించిన ‘ఆహా కళ్యాణం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినా ఆ తరువాత ఆమెకు అవకాశాలు రాలేదు. కానీ బాలీవుడ్‌ లో మాత్రం వాణి కపూర్ నటించిన ‘శుధ్ దేశీ రొమాన్స్’, ‘బే ఫిక్రే’, ‘వార్’ లాంటి సినిమాలు మంచి హిట్ అయ్యాయి.

సంబంధిత సమాచారం :