‘గాయత్రి’లో శారదగా శ్రియ !

‘గాయత్రి’లో శారదగా శ్రియ !

Published on Feb 6, 2018 3:00 PM IST

నటి శ్రియ తక్కువ కాలంలో మంచి చిత్రాలు చెయ్యడమే కాక దాదాపు అందరు తెలుగు హీరోలతో పనిచెయ్యడం విశేషం. తాజాగా శ్రియ గెస్ట్ రోల్ చేసిన సినిమా ‘గాయత్రి’. మంచు విష్ణు కు భార్యగా శారద పాత్రలో ఆమె ఈ సినిమాలో నటించడం జరిగింది. చేసింది చిన్న పాత్రే అయినా సినిమాకు ఆమె చాలా కీలకమని తెలుస్తోంది.

మదన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ బాబు రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. నిఖిల విమల్ ఈ సినిమాలో మోహన్ బాబు కుమార్తె గా నటించింది. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం పాపులర్ అయ్యింది. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు ఈ సినిమాను స్వయంగా నిర్మించడం విశేషం.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు