‘శ్యామ్ సింగ రాయ్’కు కొత్త తలనొప్పి

Published on May 22, 2021 3:00 am IST

హీరో నాని చేస్తున్న కొత్త సినిమాల్లో ‘శ్యామ్ సింగ రాయ్’ కూడ ఒకటి. రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్ర దర్శకుడు. నాని కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రం. కలకత్తా నేపథ్యంలో సాగే పిరియాడికల్ మూవీ ఇది. చాలావరకు కలకత్తాలో షూటింగ్ చేశారు. కానీ కోవిడ్ కారణంగా ఇకపై చిత్రీకరణ చేయడం కుదరలేదు. దీంతో మిగిలి ఉన్న ముఖ్యమైన సన్నివేశాల కోసం హైదరాబాద్ శివార్లలో సెట్ వేశారు. 10 ఎకరాల విస్తీర్ణంలో వేసిన ఈ సెట్ ఖరీదు ఆరు కోట్లకు పైమాటే.

అసలే కోవిడ్ లాక్ డౌన్ పడటంతో కేసులు సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో వీలైనంత త్వరగా షూట్ చేయాలని అనుకున్నారు టీమ్. కానీ కుదరలేదు. కేసులు ఉధృతం కావడంతో వారం పదిరోజులకే షూట్ ఆపేయాల్సి వచ్చింది. కానీ ఈలోపు అడపాదడపా పడిన వర్షాలకు సెట్ కొద్దిగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఇంకా కొన్ని రోజులు ఉంటే మిగతా సెట్ కూడ దెబ్బతినేలా ఉందట. మొత్తానికి భారీ ఖర్చుతో వేసిన ఈ సెట్ నిర్మాతకు నష్టాలే తెచ్చేలా ఉంది.

సంబంధిత సమాచారం :