ఎన్టీఆర్ హీరోయిన్ తల్లి అయ్యింది !
Published on Nov 27, 2017 12:19 pm IST

హీరోయిన్ అంకిత ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రేమలో పావని కళ్యాణ్‌, ధనలక్ష్మీ ఐ లవ్‌ యూ, సింహాద్రి, విజయేంద్రవర్మ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తరువాత సినిమాలు తగ్గించి న్యూజెర్సీకి చెందిన ఎన్నారై, జెపి మోర్గాన్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ అయిన విశాల్‌ జగ్తాప్‌ను వివాహం చేసుకుంది.

ఆదివారం అంకిత అబ్బాయికి జన్మనిచ్చింది. ఈ సందర్భంగా 123తెలుగు తరుపున అంకిత విశాల్ కు అభినందనలు. వీరికి 2016 లో వీరు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత అంకిత సినిమాలకు దూరంగా ఉంది.

 
Like us on Facebook