పుష్ప 2 ది రూల్ తో క్లాష్ నుండి తప్పుకున్న సింగం అగైన్?

పుష్ప 2 ది రూల్ తో క్లాష్ నుండి తప్పుకున్న సింగం అగైన్?

Published on Apr 14, 2024 11:00 PM IST

పుష్ప ది రైజ్ (Pushpa the rise) మూవీ తో వరల్డ్ వైడ్ సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). ఈ చిత్రం బన్నీ కెరీర్ లో కీలక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రానికి సీక్వెల్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule) భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఐకాన్ స్టార్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తుండగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్ 15, 2024 న ఎట్టి పరిస్థితుల్లోనూ వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

అయితే అదే టైమ్ కి బాలివుడ్ నుండి సింగం అగైన్ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం రిలీజ్ డేట్ ను పోస్ట్ పొన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే సత్తా ఉన్న చిత్రం ఈ సింగం అగైన్. ఈ చిత్రం కూడా పుష్ప 2 ది రూల్ క్లాష్ నుండి తప్పుకున్నట్లైతే, పుష్పరాజ్ డే వన్ భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పుష్ప 2 ది రూల్ నుండి రిలీజైన టీజర్ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. టీజర్ లో బన్నీ తన నట విశ్వరూపం చూపించాడు. దేవి శ్రీ ప్రసాద్ వేరే లెవెల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ చిన్న టీజర్ తో సినిమా పై అంచనాలు మరింత గా పెరిగాయి. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు