త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ధనుష్ “సార్”

త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ధనుష్ “సార్”

Published on May 14, 2023 5:39 PM IST


టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన చిత్రం సార్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా కూడా ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అవుతోంది.

త్వరలో ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీ లో ప్రసారం కానుంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు