ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత!

Published on Nov 30, 2021 4:48 pm IST

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు సాయంత్రం 4:07 గంటల సమయం లో కన్నుమూయడం జరిగింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం సినీ పరిశ్రమ కి తీరని లోటని చెప్పాలి. ఈ మేరకు ఆయన మృతి పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ నెల 24 వ తేదీన హైదరాబాద్ లోని కిమ్స్ లో చేరారు. లెజెండరీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తెలుగు సినిమా పరిశ్రమ కి 4000 కి పైగా పాటలు రాశారు. పలు అవార్డు లు అందుకున్న ఆయన, తెలుగు సినిమా కోసం ఎనలేని కృషి చేశారు.

సంబంధిత సమాచారం :