సమీక్ష : సీత – కాజల్ కోసం మాత్రమే !

Published on May 25, 2019 4:01 am IST
Sita movie review

విడుదల తేదీ : మే 24, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75 /5

నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ , సోనుసూద్

దర్శకత్వం : తేజా

నిర్మాత : అనిల్ సుంకర

సంగీతం : అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫర్ : శిరిషా రే

ఎడిటర్ :  కోటగిరి వెంకటేశ్వర్ రావ్

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ”సీత” మూవీ ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైంది. మోడరన్ సీత అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఆ నమ్మకాన్ని సినిమా ఎంతవరకు నిలబెట్టుకుందో ఇప్పుడు సమీక్షిద్దాం.

కథ:

సీత (కాజల్) మనీకి తప్ప మానవ సంబంధాలకు విలువ ఇవ్వని ఓ స్వార్థపరురాలైన యువతి. తన స్వలాభం కోసం ఎవ్వరి జీవితంతోనైనా ఆడుకునే సీత, ఓ ల్యాండ్ సెటిల్మెంట్ లో భాగంగా లో కల్ ఎంఎల్ ఏ బసవరాజు (సోనూసూద్) తో ఒక అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఆ అగ్రిమెంట్ వలన చిక్కుల్లో ఇరుకున్న సీత బయటపడటానికి కొంత డబ్బులు అవసరం అవుతాయి. చిన్నప్పటినుండి ప్రపంచంలో ఉన్న కుళ్ళు, కుంతంత్రాలు తెలియకుండా బౌద్ధారామంలో పెరిగిన అమాయకుడైన తన బావ రామ్ (శ్రీనివాస్)ని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి సీత రామ్ అకౌంట్ లో ఉన్న డబ్బు తన ఖాతాలోకి వచ్చేలా చేసుకుంటుంది. రామ్ పేరున ఉన్న ఆస్తి పై తప్ప తన పైన కొంచెం కూడా ప్రేమలేని సీత మనసును రామ్ ఎలా మార్చాడు, సీతని వెంబడిస్తున్న బసవరాజు నుండి ఎలా కాపాడాడు ? చివరికీ సీత మారిందా ? రామ్ ప్రేమను అర్ధం చేసుకుందా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఎవరిని లెక్క చేయని, ఓటమిని అంగీకరించని స్ట్రాంగ్ విమెన్ గా కాజల్ అద్భుతంగా చేసింది. టైటిల్ రోల్ చేసినందుకు సినిమా మొత్తం తన భుజాల పై మోసింది. కాజల్ పాత్రలో ఓ దశలో విలన్ షేడ్స్ కూడా కనిపిస్తాయి. ఈ మూవీ తరువాత కాజల్ కి విలన్ రోల్స్ ఆఫర్స్ వచ్చిన ఆశ్చర్యం లేదు. ఇక స్వాతి ముత్యం అమాయకుడిగా శ్రీనివాస్ పరవాలేదనిపించారు. విలన్ సోనూసూద్ కి తనికెళ్ళ భరణికి మరియు బిత్తిరి సత్తికి మధ్య నడిచే కొన్ని కామెడీ సన్నివేశాలు అలరిస్తాయి.

కాజల్ తరువాత ఈ మూవీ లో ఆకట్టుకున్న నటుడు సోనూసూద్, ఆయనకు కాజల్ తో సమానంగా స్క్రీన్ స్పేస్ ఉంది, కేవలం విలన్ గానే కాకుండా కామెడీ కూడా పండించారు. సినిమాలోని పాయల్ రాజపుట్ చేసిన బుల్రెడ్డి సాంగ్ అలరిస్తుంది. విలన్ పక్కనుంటూ సెటైర్స్ వేసే పాత్రలో తనికెళ్ళ భరణి మెప్పించారు. ఇక మిలిగిన నటీనటులు కూడా తమ పాత్ర మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్:

కాజల్ పాత్రను ఒక రేంజ్ లో ఎలివేట్ చేసిన తేజ మిగతా పాత్రలపై దృష్టి పెట్టలేదు. ఎంచుకున్న కథకి ఆకట్టుకునే కథనం రాయడం లో ఫెయిల్ ఐయ్యారు. మలుపు లేని కథనం ఎక్కడా ప్రేక్షకుడికి త్రిల్ ఫీల్ ఐయ్యేలా చెయ్యదు. ప్రేక్షకుడికి తరువాత రాబోతున్న సీన్ అర్దమైపోతుంటే సినిమాపై ఆసక్తి ఉండదు. అదే ఈ సినిమాలో మైనస్.

ఇప్పటివరకు భారీ యాక్షన్ మూవీస్ హీరోగా చుసిన జనాలు శ్రీనివాస్ ని అమాయకపు పాత్రలో ఊహించుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. చాలా స్కీన్స్ లో లాజిక్ మిస్సయింది. నాలుగు బుల్లెట్లు దిగి పల్స్ రేట్ 24 కి పడిపోయిన హీరో లేచి ఫైట్ చేయడం కొంచెం నమ్మబుద్ది కాదు. సినిమాకి మ్యూజిక్ మరో మైనస్, ఒక్కపాట కూడా మనసుకు హత్తుకునేలా లేదు. సీరియస్ సీన్స్ లో కామెడీ, కామెడీ చేసే చోటా సీరియస్ గా మూవీ సాగింది.

సాంకేతిక వర్గం:

దర్శకత్వం పరంగా తేజ పర్వాలేదనిపించారు, కానీ ఆయన గత సినిమాలతో పోల్చుకుంటే అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. కథకు మంచి స్క్రీన్ ప్లే జోడిస్తే సినిమా బాగా ఉంటుంది. సన్నివేశాలు స్క్రీన్ పై పండాలంటే మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అవసరం. ఈ మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతగా ఆకట్టుకోదు. డి ఓ పి, ఎడిటింగ్ పరవాలేదనిపించాయి.

తీర్పు:

ఏమైనా స్వార్థపరురాలైన సీతను అమాయకుడైన రామ్ ని డీల్ చేయడంలో తేజ సక్సెస్ కాలేకపోయాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో తేజ ఆకట్టుకున్నప్పటికీ.. మిగితా సినిమాలో చాలా వరకు స్లోగా సాగే సీక్వెన్స్ స్ తో నిరుత్సాహ పరుస్తాడు. ఐతే కాజల్, సాయి శ్రీనివాస్ తమ నటనతో సినిమాలో బాగానే అలరించారు. మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.

123telugu.com Rating : 2.75 /5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :