శివ కార్తికేయన్ ‘డాన్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్..!

Published on Nov 10, 2021 9:59 pm IST


తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ విభిన్నమైన కథలను, పాత్రలను ఎంచుకుని సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఇటీవల ఆయన హీరోగా చేసిన ‘వరుణ్ డాక్టర్’ సినిమా మంచి వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శివ కార్తికేయన్ లైకా ప్రొడక్షన్స్ వారితో కలిసి ఓ సినిమాను చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాకు “డాన్” అనే టైటిల్‌ను ఖరారు చేయగా, దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్‌లో కొంతమంది స్టూడెంట్స్ తమ చేతిలో ఉన్న వస్తువులను శివ కార్తికేయన్ పైకి విసురుతున్నట్టు ఉంది. కాగా ఇది కామెడీ టచ్ ఉన్న కథ అని, కాలేజ్ లెక్చరర్ అయిన శివ కార్తికేయన్ స్టూడెంట్స్ పట్ల ఒక ‘డాన్’ మాదిరిగా వ్యవహరిస్తారని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More