100 కోట్ల క్లబ్ లోకి శివ కార్తికేయన్ “డాన్”

Published on May 25, 2022 2:00 pm IST


యంగ్ అండ్ టాలెంటెడ్ కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ సక్సెస్ పర్వం కొనసాగుతూనే ఉంది. రెండు వారాల క్రితం విడుదలైన అతని తాజా చిత్రం డాన్ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయ్యింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా 12 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టిన చిన్న సినిమాల్లో ఇదొకటి.

తక్కువ ప్రమోషన్లు ఉన్నప్పటికీ, ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా లో బాగా నడుస్తోంది. ప్రియాంక మోహన్ ఈ చిత్రం లో శివకార్తికేయన్ సరసన హీరోయిన్ గా నటించింది, ఇందులో SJ సూర్య కూడా కీలక పాత్రలో నటించడం జరిగింది. సిబి చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ మరియు శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ లపై సంయుక్తం గా నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :