‘మజ్ను’ కోసం ఇంకాస్త వెయిట్ చెయ్యాలన్న నాని
Published on Aug 26, 2016 8:32 am IST

majnu
‘జెంటిల్మెన్’ విజయం తరువాత హీరో నాని చేస్తున్న చిత్రం ‘మజ్ను’. ఈ మధ్యే విడుదలైన టీజర్ సినిమాపై మంచి క్రేజ్ ను క్రియేట్ చేసింది. కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఈ చిత్రం తాలూకు ఆడియో ఈరోజు విడుదల కావాల్సి ఉండగా అది కాస్త పోస్ట్ పోన్ అయింది. ఇదే విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ హీరో నాని ట్విట్టర్లో ‘మజ్ను ఆడియో లాంచ్ రెండు రోజులు పోస్ట్ పోన్ అయింది. కాబట్టి ఆడియో కోసం ఇంకాస్త వెయిట్ చెయ్యాలి’ అన్నారు.

ఇప్పటికే విడుదలైన ‘కళ్ళు మూసి’ అనే పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా ఈరోజు మరో పాట ‘మేఘమాల’ విడుదలకానుంది. ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్ నిర్మిస్తున్నారు. నాని సరసన అను ఇమ్మాన్యుల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 17న విడుదల కానుంది.

 
Like us on Facebook