భరత్ అనే నేను ఫంక్షన్ లో చిన్న మార్పు !

25th, March 2018 - 10:21:06 AM

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా భరత్ అనే నేను. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మొదట వైజాగ్ లో జరపాలని భావించిన తాజా సమాచారం మేరకు ఫంక్షన్ ను విజయవాడలో జరపాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ మొదటివారంలో ఈ ఫంక్షన్ చెయ్యబోతున్నారు. ఈవెంట్ లో స్టేజి సెట్ అసెంబ్లీలా ఉండబోతోంది. దీనికోసం భారి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ రోజు ఉదయం విడుదలైన భరత్ అనే నేను మొదటి సాంగ్ కు మంచి స్పందన లభిస్తోంది. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవి సంగీతం అందిస్తున్నాడు. ఒక్క ఫారిన్ షెడ్యూల్ తప్పా దాదాపు చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా పై భారి అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.