అ సినిమాకు చిన్న పాప పాత్ర కీలకం కాబోతోంది !

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో నాని నిర్మాతగా మారి నిర్మించిన సినిమా అ. ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. తొమ్మిది పాత్రల చుట్టూ తిరిగే ఈ చిత్రంలో నిత్యామేనన్‌, కాజల్‌, శ్రీనివాస్‌ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

మంచి కథ, డిఫరెంట్ కథనం తో ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం. సినిమాలో ఉన్న ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. అ సినిమాలో కేవలం ఒక్క పాట మాత్రమే ఉందట. అది కూడా కథలో భాగంగా ఈ పాట ఉండబోతుందని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా చిన్న పాప చేసిన పాత్ర సినిమాకు కీలకంగా మారుతుందని సమాచారం.