ఓటిటి : “హను మాన్” క్లారిటీ కోసం చాలా మంది వెయిటింగ్

ఓటిటి : “హను మాన్” క్లారిటీ కోసం చాలా మంది వెయిటింగ్

Published on Feb 29, 2024 3:09 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ కాంబినేషన్ హీరో తేజ సజ్జ అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ నుంచి రెండో సినిమాగా వచ్చిన సూపర్ హీరో చిత్రం “హను మాన్”. మరి గట్టి హైప్ నడుమ వచ్చిన ఈ పాన్ ఇండియా చిత్రం ఊహించని రేంజ్ విజయాన్ని నమోదు చేసి టాలీవుడ్ లో ఆల్ టైం రికార్డు సంక్రాంతి గ్రాసర్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు ఫైనల్ గా థియేటర్స్ లో స్లో అయ్యిన ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం అయితే ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి మార్చ్ 2న స్ట్రీమింగ్ యాప్ జీ 5 లో పాన్ ఇండియా భాషల్లో వస్తుంది అని స్ట్రాంగ్ బజ్ వినిపించింది. అయితే ఇప్పుడు మార్చ్ రానే వస్తుంది.

దీనితో ఈ డేట్ పై హను మాన్ మూవీ లవర్స్ ఆ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారో అనేది చూడాలి. ఇక ఈ చిత్రానికి గౌర హరీష్ సంగీతం అందించగా నిరంజన్ రెడ్డి నిర్మాణం వహించారు అలాగే మరో పక్క “జై హనుమాన్” పనులు జరుగుతుండగా మరో పక్క “హను మాన్” పాన్ వరల్డ్ రిలీజ్ కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు