
‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో, ‘రేసుగుర్రం’ లాంటి సూపర్ హిట్‌తో జోరు మీదున్న అల్లు అర్జున్ నటించిన చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. ఇప్పటికే ప్రచార చిత్రాల ద్వారా, టీజర్ ద్వారా ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించిన సన్నాఫ్ సత్యమూర్తి, విడుదలకు ముందే సంచనాలను నమోదు చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సినిమా యూనిట్ బిజీగా ఉంది. ఇక తాజా సమాచారం మేరకు ఈ నెల 26న ఈ సినిమాని సెన్సార్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది.
ఆదివారం విడుదలైన ఆడియోకి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ట్రైలర్‌లో అల్లు అర్జున్ స్టైల్, త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానులైతే ఈ కాంబినేషన్ మరొక హిట్ కొట్టినట్టే అని సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పుడు సెన్సార్ తేదీ కూడా తెలిసిపోయినందున సినిమా ఎప్పుడనే దానిపైనే చర్చ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఏప్రిల్ 8న సినిమా విడుదల చేయనున్నారని తెలుస్తోంది.

