సోషల్ మీడియాలో తారలంతా ‘ఫినిషర్’ ధోని నామ స్మరణ.!

Published on Apr 22, 2022 8:00 am IST

వెండితెరపై ఆ మహేంద్ర ‘బాహుబలి’ కి ఎంత క్రేజ్ ఉందో క్రికెట్ విషయానికి వస్తే మహేంద్ర సింగ్ ధోనీ కి కూడా అంతే క్రేజ్ ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క ఐపీఎల్ ఫార్మాట్ లో తప్ప అన్ని క్రికెట్ ఫార్మట్స్ లో రిటైర్ అయ్యిపోయిన ధోని ఐపీఎల్ లో ఒక మెరుపులా ఇప్పుడు ప్రకాశిస్తున్నాడు.

ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లలో ఫస్ట్ ఆట నుంచే అదరగొడుతూ వస్తున్న ధోని నిన్న ముంబై ఇండియన్స్ తో జరిగినటువంటి మ్యాచ్ తో తాను ఎందుకు గ్రేటెస్ట్ ఫినిషర్ గా పిలవబడతాడో నిరూపించాడు. తాను చివరి ఓవర్ వరకు ఉంటే ఆ క్రేజీనెస్ ఎలా ఉంటుందో ఇన్నేళ్ల తర్వాత కూడా చూపించడంతో థలా ధోని నామ స్మరణతో ప్రతి ఒక్కరి సోషల్ మీడియా నిండిపోయింది.

దేశ వ్యాప్తంగా కూడా అనేక మంది తారలు ధోని ఇన్నింగ్స్ కోసమే మాట్లాడుతున్నారు. ఇక మన టాలీవుడ్ నుంచి కూడా తక్కువేం కాదు అనేక మంది నటులు దర్శకులు సంగీత దర్శకులు కూడా నిన్నటి ఇన్నింగ్స్ తో ట్వీట్స్ చెయ్యగా అవన్నీ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :