మెగాస్టార్ – బాబీ ప్రాజెక్ట్ కి అదిరిపోయే టైటిల్ కన్ఫర్మ్ అయ్యిందా.?

Published on Feb 11, 2022 9:00 am IST


మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమాల్లో దర్శకుడు తన ఫ్యాన్ బాయ్ కె ఎస్ రవీంద్ర(బాబీ) తో చేస్తున్న ఒక మాస్ ఎంటర్టైనర్ కూడా ఒకటి. మళ్ళీ వింటేజ్ మెగాస్టార్ ని గుర్తు చేసేలా సినిమా తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు మొదటి నుంచి మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి ఒక సాలిడ్ టైటిల్ ని మేకర్స్ పెడుతున్నారని కొన్ని టైటిల్స్ ఆమధ్య పెద్ద ఎత్తునే వైరల్ అయ్యాయి. కానీ వాటిలో మాత్రం “వాల్తేరు వీరయ్య” అనే టైటిల్ కి గట్టి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో చిరు చేసే రోల్ కి గాను కరెక్ట్ గా యాప్ట్ అయ్యేలా ఉంటుందని కూడా అనిపించింది.

అయితే ఇప్పుడు మాత్రం దీనికి దగ్గరగా ఉండే ఇంకో టైటిల్ పేరు వినిపిస్తుంది. దీని సౌండింగ్ అయితే ఇంకా బెటర్ గా ఉందని చెప్పాలి. అదే టైటిల్ “వాల్తేరు మొనగాడు”. ఈ తరహా మాస్ టైటిల్స్ మెగాస్టార్ కి అదిరే లెవెల్లో సెట్టవుతాయి ఇది కానీ నిజం అయితే టైటిల్ తోనే మంచి హైప్ ఈ సినిమాపై రావడం గ్యారెంటీ.

సంబంధిత సమాచారం :