రాబోయే “భీమ్లా నాయక్” సాంగ్ పై క్లారిటీ..!

Published on Dec 4, 2021 7:06 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు ప్రధాన పాత్రలలో దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ “భీమ్లా నాయక్” భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ కి ప్లాన్ చేస్తుండడం తో పాటు ఈ మధ్యలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా రివీల్ చేస్తున్నారు.

మరి ఈరోజు ఈ చిత్రం నుంచి నాలుగో సాంగ్ ని రిలీజ్ చేస్తుండగా దానిపై క్లారిటీ తెలుస్తోంది. అంతా ఈ సాంగ్ ని పవన్ కళ్యాణ్ పాడింది అనుకుంటున్నారు. కానీ ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ పాడిన పాట కాదు. ఇది కన్ఫర్మ్. తాను ఆలపించినది బహుశా తర్వాత రిలీజ్ కావచ్చు.

కానీ ఇప్పుడు వచ్చే అడవి తల్లి సాంగ్ కూడా మంచి చార్ట్ బస్టర్ అవుతుంది అనో తెలుస్తోంది. ఇక ఈ చిత్రంకి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :