మెగాస్టార్ టచ్ తో ఆసక్తి రేపుతున్న “సన్ ఆఫ్ ఇండియా” టీజర్.!

Published on Jun 4, 2021 1:00 pm IST

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సన్ ఆఫ్ ఇండియా” టీజర్ ను మేకర్స్ ఈరోజు స్టార్ హీరో సూర్య చేతులు మీదగా ఈ టీజర్ ను విడుదల చేయించారు. మరి ఈ టీజర్ లో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో చిన్న టచ్ ఇవ్వడం విశేషం. మరి మెగాస్టార్ వాయిస్ ఓవర్ లో స్టార్ట్ అయిన ఈ టీజర్ లో మోహన్ బాబు రోల్ కోసం వివరిస్తూ చెప్పిన అంశాలు మంచి ఆసక్తికరంగా ఉన్నాయి.

అలాగే మోహన్ బాబు చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ లో ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా పైగా పలు భిన్నమైన షేడ్స్ లో కనిపించడం మరో ఆసక్తికర అంశంగా కనిపిస్తుంది. అయితే ఈ చిత్రం ఒక క్రైమ్ థ్రిల్లర్ గా దర్శకుడు డైమండ్ బాబు ప్లాన్ చేసిన ఈ టీజర్ చూస్తే అర్ధం అవుతుంది.

అలాగే లెజెండరీ సంగీత దర్శకులు మేస్ట్రో ఇళయరాజా సంగీతం కూడా మంచి ట్రెండీగా మరియు ఇంప్రెసివ్ గా ఉండి ఈ టీజర్ కు మరో ప్రధానాకర్షణగా నిలిచింది. వీటితో పాటుగా లాస్ట్ లో మోహన్ బాబు చెప్పిన తన మార్క్ పంచ్ డైలాగ్ అన్ని బాగానే ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల కానుందో వేచి చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :