బిగ్‌బాస్ 5: సింగర్‌ శ్రీరామచంద్రకు రియల్ హీరో సపోర్ట్..!

Published on Nov 10, 2021 3:00 am IST


బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగులో ఐదో సీజన్ అప్పుడే పదో వారానికి చేరుకుంది. ఈ సారి హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లగా మొదటి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత వర్మ, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, రీసెంట్‌గా విశ్వ ఎలిమినేట్ కావడం, తాజాగా అనారోగ్యం కారణంగా జెస్సీ బయటకు రావడంతో ప్రస్తుతం హౌస్‌లో 9 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్‌లో ఉన్న సభ్యులకు సెలబ్రెటీల నుంచి సపోర్ట్ బాగానే లభిస్తుంది.

అయితే తాజాగా రియల్ హీరో సోనూసూద్ తెలుగు బిగ్‌బాస్‌ షోపై స్పందించాడు. సింగర్‌ శ్రీరామచంద్రకు తన మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 5లో శ్రీరామ్‌ను చూస్తున్నారా? నేనూ చూస్తున్నాను. షోలో నీ బెస్ట్‌ ఇవ్వు శ్రీరామ్‌. అతడికివే నా ప్రేమాభినందనలు.. లవ్‌ యూ మ్యాన్‌’ అని సోనూసూద్ అనండు. ఈ వీడియో చూసిన శ్రీరామ్‌ అభిమానులు ఈ సారి సీజన్ విన్నర్‌గా శ్రీరామ్‌ నిలవడం గ్యారెంటీ అని చెప్పుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

More