సింధు కోచ్ పాత్రలో ప్రముఖ నటుడు !

Published on Dec 11, 2018 9:53 am IST

జాతీయ స్థాయి బ్యాట్మెంటన్ క్రీడారకారిణి, తెలుగు తేజం పీవీ సింధు జీవితం ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈచిత్రంలో ప్రముఖ నటుడు సోనూసూద్ సింధు కి కోచ్ గా కనిపించనున్నారు. అంతేకాకుండా ఆయనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈచిత్రంలో సింధు పాత్రలో ఎవరు నటిస్తారో తెలియాల్సి వుంది.

ఇక ఈ చిత్రం తో పాటు మరో బ్యాట్మెంటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆదారంగా ‘సైనా’ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో సైనా పాత్రలో శ్రద్ధ కపూర్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ను జరుపుకుంటుంది.

సంబంధిత సమాచారం :