నితిన్ సినిమా విడుదలకు స్పెషల్ ప్లాన్స్ ఉన్నాయా ?

నితిన్ సినిమా విడుదలకు స్పెషల్ ప్లాన్స్ ఉన్నాయా ?

Published on Sep 18, 2020 1:50 AM IST


హీరో నితిన్ చేస్తున్న కొత్త చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటెర్టైనర్ గా ఉండనుంది. లాక్ డౌన్ కారణంగా చిత్రీకరణ ఆలస్యం కావడంతో వీలైనంత త్వరగా సినిమాను ముగించి విడుదలకు సిద్దం చేయాలని అనుకుంటున్నారు. సినిమా థియేటర్లు అనుకున్న సమయానికి ఓపెన్ అయితే చిత్రం నేరుగా థియేటర్లలోకే వస్తుంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా చిత్రాన్ని విడుదల చేయాలని టీమ్ భావిస్తోందట. అందుకే ఒక ప్రముఖ ఓటీటీ సంస్థతో మాటలు నడుస్తున్నాయట.

తాజా సమాచారం మేరకు ఒకవేళ సినిమా ఓటీటీ ద్వారా విడుదల చేయాల్సి వస్తే ఒక విన్నూత్నమైన విధానంతో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదే పే పర్ వ్యూ పద్దతి. ఈ పద్దతిలో సినిమా చూడాలనుకున్న ప్రతిసారి ప్రేక్షకులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మామూలుగా అయితే ఓటీటీలో ఒక్కసారి సభ్యత్వం తీసుకుంటే నెలవారీ రుసుము మీద ఎన్నిసార్లైనా ఒక సినిమాను వీక్షించవచ్చు. కానీ పే పర్ వ్యూ పద్దతిలో మాత్రం సినిమా హాలుకి వెళ్లిన్న ప్రతిసారి టికెట్ కొన్నట్టు సినిమాను వీక్షించిన ప్రతిసారీ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతానికి ఈ తరహా ప్లానింగ్ జరుగుతుందని అంటున్నారే కానీ ఇంకా ఫైనల్ అయినట్టు కన్ఫర్మేషన్ రాలేదు. మరి టీమ్ ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. ఇందులో నితిన్ సరసన స్టార్ నటి కీర్తి సురేష్ కథానాయకిగా నటించనుంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ పిసి శ్రీరామ్ ఈ చిత్రానికి పనిచేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు