బిగ్ బాస్ హౌస్ లోకి తెలుగు హీరోయిన్…?

Published on Aug 24, 2019 11:24 am IST

తెలుగు బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగిపోతుంది. మొదలైన నాలుగు వారాలలో నలుగురు షో కి బై చెప్పివెళ్లిపోయారు. ఈవారం ఎలిమినేషన్ కి గాను ఏడుగురు సభ్యులు నామినేట్ కావడం జరిగింది. మరి ఈ ఏడుగురిలో ప్రేక్షకులు ఎవరిని ఇంటి దారి పట్టించనున్నారో ఇంకొద్ది గంటల్లో తెలియనుంది. ఐతే బిగ్ బాస్ షో వైల్డ్ కార్డు ఎంట్రీ పై ఓ ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతుంది.

కాగా బిగ్ బాస్ షో లో వైల్డ్ కార్డు ఎంట్రీ ప్రవేశం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ద్వారా ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి ప్రవేశించడం, ఆమె విపరీత ప్రవర్తన కారణంగా షో నుండి ఎలిమినేట్ కాబడటం జరిగిపోయింది. మరో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఒక తెలుగు హీరోయిన్ షోలో ప్రవేశించనున్నారట. తెలుగు అమ్మాయి అయిన ఈషా రెబ్బా బిగ్ బాస్ షో లోకి ప్రవేశించనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇదే కనుక జరిగితే షో కి మరింత గ్లామర్ యాడ్ అయినట్లే లెక్క.

సంబంధిత సమాచారం :