‘స్పైడర్’ కృష్ణా జిల్లా కలెక్షన్లు!
Published on Sep 28, 2017 1:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ సినిమా భారీ అంచనాల నడుమ నిన్న బుధవారం విడుదలైంది. రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లకు కీలకమైన కృష్ణా ఏరియాలో రూ .89. 4 లక్షలను వసూలు చేసింది. ఇంకో నాలుగు రోజులపాటు పండుగ సెలవులు ఉండటంతో ఈ కలెక్షన్లు ఐనాక్స్ట్ మెరుగుపడే ఛాన్సుంది. మహేష్ కేరీర్లోనే మొదటిసారిగా స్టార్ ఇమేజ్ ను పక్కబెట్టి కథకు ప్రాధాన్యత ఇచ్చి చేసిన ఈ చిత్రం తమిళనాడులో మంచి స్పందన తెచ్చుకుంది.

ఇకపోతే ఈ సినిమా ఓవర్సీస్లో ప్రీమియర్ల రూపంలోనే మిలియన్ డాలర్ వసూళ్లను కొల్లగొట్టింది. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి ప్రస్తుతం మిక్స్డ్ రివ్యూస్ నడుస్తుండగా ఇంకొద్ది రోజులుపోతే పూర్తిస్థాయి రిజల్ట్ బయటపడనుంది. ఇకపోతే చిత్ర హక్కులు అమ్ముడైన ప్రతి చోటా భారీ ధర పలకగా ఆ మొత్తం వెనక్కు రావాలంటే ఖచ్చితంగా సినిమాకు లాంగ్ రన్ ఉండి తీరాల్సిందే.

 
Like us on Facebook