“SR కళ్యాణ మండపం” ఓటిటి డేట్ ఇదేనా!?

“SR కళ్యాణ మండపం” ఓటిటి డేట్ ఇదేనా!?

Published on Aug 18, 2021 11:50 AM IST


కిరణ్ అబ్బవరం మరియు ప్రియాంకా జవాల్కర్ హీరో హీరోయిన్ లుగా శ్రీధర్ గాదె దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం SR కళ్యాణ మండపం. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రమోద్ మరియు రాజు లు ఈ చిత్రానికి నిర్మాతలు గా వ్యవహరించగా, ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్ అందించారు.

అయితే ఈ చిత్రం తాజాగా ఓటిటి ద్వారా విడుదల కానుంది అని వార్తలు వచ్చాయి. ఆహా వీడియో లో ఈ చిత్రం స్ట్రీమ్ కానున్నట్లు అధికారిక ప్రకటన సైతం వెలువడింది. ప్రస్తుతం ఈ చిత్రం ఎప్పుడు ఓటిటి లో అందుబాటులో ఉంటుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆగస్ట్ నెలలోనే ఈ చిత్రం ఆహా వీడియో లో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 28 వ తేదీన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులకు అందుబాటులోకి రానునట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు