“SR కళ్యాణమండపం”కు ఇప్పటివరకు ఎంత వసూళ్లు వచ్చాయంటే..!

“SR కళ్యాణమండపం”కు ఇప్పటివరకు ఎంత వసూళ్లు వచ్చాయంటే..!

Published on Aug 21, 2021 2:46 AM IST

కిరణ్ అబ్బవరం, ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరో హీరోయిన్లుగా శ్రీధ‌ర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కిన “SR కళ్యాణ మండపం” ఆగస్ట్ 6వ తేదిన థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన సినిమాల్లో తొలి క్లీన్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. ఈ సినిమా 14 రోజుల్లో దాదాపు 8.30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

అయితే వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాను రూ 4.55 కోట్లకు అమ్మారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇంత బిజినెస్ రావడం కష్టమే అని చాలా మంది అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసిన ఈ సినిమా పెట్టిన రేటు కంటే డబుల్‌ను సాధించింది. దీంతో చాలా రోజుల తర్వాత డిస్ట్రిబ్యూటర్ల ముఖాల్లో సంతోషం కనిపిస్తుంది.

2 వీక్స్ కలెక్షన్స్ రిపోర్ట్:

నైజాం – 2.94 కోట్లు
సీడెడ్ – 1.15 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.98 కోట్లు
ఈస్ట్ – 0.51 కోట్లు
వెస్ట్ – 0.35 కోట్లు
గుంటూరు – 0.69 కోట్లు
కృష్ణా – 0.42 కోట్లు
నెల్లూరు – 0.25 కోట్లు

ఏపీ + తెలంగాణ = 7.66 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ = 0.70 కోట్లు
వరల్డ్ వైడ్ = 8.31 కోట్లు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు