ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : శ్రీవిష్ణు – ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం కిశోర్ తిరుమల !
Published on Oct 26, 2017 3:44 pm IST

హీరో శ్రీ విష్ణు ఒకవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు మంచి పాత్రలు, కథలు దొరికితే వేరే హీరోలతో కలిసి కూడా సినిమాలు చేస్తున్నారు. అలా అయన చేసిన సినిమానే ‘ఉన్నది ఒకటే జిందగీ’. ఈ సినిమాలో రామ్ కు స్నేహితుడిగా నటించారాయన. కథలో కీలకంగా కనిపించబోయే తన పాత్ర గురించి, సినిమా గురించి మా 123తెలుగుతో ప్రత్యేకంగా ముచ్చటించారాయన. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?
జ) అంటే ప్రతి ఒక్కరు తమ లైఫ్ ఉన్న బెస్ట్ ఫ్రెండ్ ను చూసినట్టే ఉంటుంది నా క్యారెక్టర్. అంత సహజంగా, కీలకంగా ఉంటుంది. ఎక్కడా ఎక్కువ తక్కువలు లేకుండా కరెక్టుగా ఉంటుంది.

ప్ర) ఈ సినిమాలో మీక్కూడా లవ స్టోరీ లాంటిదేమైనా ఉంటుందా ?
జ) అదే సినిమాలో ఆసక్తికరమైన విషయం. దాన్ని సినిమా చూసే తెలుసుకోవాలి. నాకైతే లవ్ ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు. కానీ పాత్రలో ఒక మ్యాజిక్ లాంటిది ఉంటుంది.

ప్ర) సినిమాలో మీ కారెక్టర్ చాలా కీలకమని విన్నాం ?
జ) అవును. సినిమా మొత్తం నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఎక్కడ నుంచి చూసినా కథ నా క్యారెక్టర్ తోనే ముడిపడి ఉంటుంది. ప్రతి సన్నివేశంలోను నా ప్రస్తావన ఉంటుంది.

ప్ర) రామ్ తో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
జ) చాలా బాగుంది. నిజానికి అలా ఉంటుందని నేను ఊహించలేదు. సెట్స్ లో ఎప్పుడూ సినిమా గురించే మాట్లాడుకునే వాళ్ళం. మూడు రోజుల్లోనే మంచి ఫ్రెండ్ అయిపోయాడు.

ప్ర) సోలో హీరోగా చేస్తున్న సమయంలో మిమ్మల్ని ఈ సినిమా చేసేలా చేసిన అంశం ?
జ) కిశోర్ తిరుమలే నేనీ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం. కిశోర్ నేను చాలా మంచి ఫ్రెండ్స్. అందుకే ఒప్పుకున్నాను. ఆ తర్వాత రామ్ చేస్తుండటం, స్రవంతి మూవీస్ సినిమా కావడం కూడా ఇతర కారణాలు.

ప్ర) కిశోర్ తిరుమలలో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
జ) నేను చాలా మంది దర్శకులతో పని చేశాను. ఈయనతో వర్క్ ఈజీగా, సులభంగా ఉంటుంది. నటించడం కాకుండా పాత్రలో ఇన్వాల్ అయి చేయమంటాడు. ఎక్కడా హడావుడి అనేదే ఉండదు. ఆయనతో పని చాలా బాగుంటుంది.

ప్ర) సోలో హీరోగా ఏయే సినిమాలు చేస్తున్నారు ?
జ) సోలో హీరోగా ‘నీది నాది ఒకే కథ’ చేస్తున్నాను. ‘మెంటల్ మదిలో’ రిలీజుకు సిద్ధమవుతోంది. పవన్ సాదినేని కూడా రెండు మంచి స్క్రిప్ట్స్ చెప్పాడు. ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను. కానీ ఎప్పుడనేది మాత్రం చెప్పలేను.

ప్ర) నారా రోహిత్ గారితో సినిమాలేమైనా చేస్తున్నారా ?
జ) నారా రోహిత్ తో కలిసి ‘వీర భోగ వసంత రాయలు’ చేస్తున్నాను. వాళ్ళందరి పార్ట్ అయిపోయింది. ఇక నాదొక్కడిదే మిగిలుంది. ఈ సినిమా విడుదలయ్యాక వెళ్లి షూట్లో జాయిన్ అవుతాను.

ప్ర) ‘వీర భోగ వసంత రాయలు’ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?
జ) అది మన తెలుగుకి కొత్తగా ఉంటుంది. కథ గతంలోకి వెళ్ళేది కాదు. ప్రస్తుతం నుండి భవిష్యత్తులోకి వెళుతుంది. చాలా భిన్నంగా ఉంటుంది.

ప్ర) హీరోగా కెరీర్లో ఇప్పటి వరకు ఎంత ముందుకెళ్లానని అనుకుంటున్నారు ?
జ) నేనసలు ఆ కోణం నుండే ఆలోచించను. మంచి పాత్రలు, కథలు వచ్చి, నాకు సరిపోతాయి అనుకుంటే చేసేస్తాను.

ప్ర) దర్శకత్వం వైపు వెళ్లే ఆలోచనలేమైనా ఉన్నాయా ?
జ) నేను వచ్చింది ఆ డిపార్ట్మెంట్ నుండే. అది సులభమని అనుకుంటాం. కానీ అన్నిటికన్నా అదే చాలా కష్టం.

ప్ర) ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కి మీరు స్క్రిప్ట్ వర్క్ చాలా చేశారట నిజమేనా ?
జ) నేననే కాదు అందరమూ చేశాం. ఏదైనా కథ నచ్చి ఒప్పుకుంటే స్క్రిప్ట్ స్టేజ్ నుండి ఆ దర్శకుడితో కంప్లీట్ గా ట్రావెల్ అవుతూ ఉంటాను. అలా అయినప్పుడే మంచి ఔట్ ఫుట్ బయటికొస్తుందని నా నమ్మకం.

ప్ర) ఈ కథలో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకునే సన్నివేశాలేమైనా ఉంటాయా ?
జ) మూడు నాలుగు బ్లాక్స్ ఉంటాయి. అద్దిరిపోయేలా ఉంటాయి. అంటే రెగ్యులర్ సినిమాల కాకాకుండా కొత్తగా ఉంటాయి. అవి కూడా వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి. స్నేహంతో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది.

ప్ర) సినిమాలో రామ్ లా రియల్ లైఫ్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ?
జ) రియల్ లైఫ్లో నాకు నారా రోహిత్ మంచి ఫ్రెండ్. 13 ఏళ్లుగా పరిచయం. ఇంకా మంచి స్నేహితులు ఉన్నారు కానీ రోహిత్ ఎక్కువ క్లోజ్.

ఇంటర్వ్యూ చేసిన వారు – యశ్వంత్

 
Like us on Facebook