బాహుబలి చిత్రం భారతీయ సినీ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందించింది. బాహుబలి 2 వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసి, భారతీయ సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసింది. ఈ చిత్రం కి సంబందించిన ప్రీక్వెల్ రెడీ అయిపోయింది. కాకపోతే యానిమేటెడ్ సిరీస్ రూపంలో. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరిట తెరకెక్కిన ఈ ప్రీక్వెల్ మే 17, 2024 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.
ఈ సిరీస్ లో బాహుబలి మరియు భళ్ళాల దేవ పాత్రల వీరోచిత ప్రదర్శనలు ఉన్నాయి. రక్తదేవ్ అనే ఒక విలన్ తో వీరు తలపడనున్నారు. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగం గా దర్శక దిగ్గజం, ఎస్ ఎస్ రాజమౌళి రేపు మీడియా తో ఇంటరాక్ట్ కానున్నారు. AMB సినిమాస్ లో రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు మీడియా ఇంటరాక్ట్ స్టార్ట్ కానుంది. ఈ సిరీస్ కి సంబందించిన రెండు ఎపిసోడ్ లని ప్రత్యేకం ప్రదర్శింపనున్నారు. ఈ ఈవెంట్ లో జక్కన్న ఏం మాట్లాడతారు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న సినిమా గురించి ఏమైనా అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాంగ్ మరియు నవీన్ జాన్ లు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను రాజమౌళి, శోభు యార్లగడ్డ, డెవరాజన్ లు సంయుక్తం గా నిర్మించారు. భారతీయ ప్రధాన భాషల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉండనుంది. ఈ సిరీస్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.