క్రేజీ ఆఫర్ కొట్టేసిన ‘శ్రీముఖి’
Published on Aug 1, 2016 11:34 am IST

srimukhi
‘జులాయి’ సినిమాలో ‘అల్లు అర్జున్’ చెల్లెలిగా కనిపించి ఆ తరువాత పలు పాపులర్ టీవీ కార్యక్రమాలతో, సినిమా ఫంక్షన్లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి, యాంకర్ ‘శ్రీముఖి’. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ అడల్ట్ కామెడీ చిత్రం ‘హంటర్’ కు రీమేక్ గా తెరకెక్కతున్న తెలుగు చిత్రంలో ఓ కీ రోల్ దక్కించుకుంది.

ఇప్పటికే శ్రీముఖి ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మ‌న్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దర్శకుడు, నటుడు శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్ర పోషిస్తుండగా స్టార్ హీరోయిన్ ‘రెజినా’ సైతం ఇందులోని ఓ ప్రధాన పాత్రలో నటించనుంది. కొత్త దర్శకుడు ‘నవీన్ మేడారం’ తెరకెక్కించనున్న ఈ చిత్రం వచ్చే వారం నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

 
Like us on Facebook