మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమానే ‘కామ్రేడ్ కళ్యాణ్’. ఓ ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ ఎంటర్టైనర్ శ్రీవిష్ణు కెరీర్ లో మరో హిట్ గా నిలిచింది. డీసెంట్ బజ్ నడుమ థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా తన కెరీర్ లో మరో సాలిడ్ ఓపెనర్ గా నిలిచినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి డే 1 నాలుగు కోట్ల 15 లక్షల గ్రాస్ వసూలు అయ్యింది.
దీనితో తన గత సినిమా సింగిల్ తరహాలోనే ఈ సినిమా కూడా సాలిడ్ ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం. ఇక రెండో రోజు స్ట్రాంగ్ బుకింగ్స్ తో ఈ సినిమా మన దగ్గర జోరు చూపిస్తుంది. సో మొత్తానికి కామ్రేడ్ కళ్యాణ్ తో శ్రీవిష్ణు తన విజయ పరంపర కొనసాగిస్తున్నాడని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్ గా నటించింది. అలాగే జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహించారు. అలాగే వెంకట కృష్ణ కర్ణాటి నిర్మాణం వహించారు.


