మళ్ళీ డ్రైగా మారుతున్న టాలీవుడ్.. ఈ సినిమాలపైనే ఆశలు!

మళ్ళీ డ్రైగా మారుతున్న టాలీవుడ్.. ఈ సినిమాలపైనే ఆశలు!

Published on Oct 10, 2026 11:03 AM IST

గత కొన్నేళ్ల వ్యవధిలోనే ఊహించని పరిణామాలు టాలీవుడ్ లో చోటు చేసుకున్నాయి. థియేటర్స్ కి జనం రాక ఖాళీగా దర్శనం ఇస్తే ఏంటీ పరిస్థితి అని చాలా మందికి అర్ధం కాలేదు. సరైన కంటెంట్ లేక? లేకపోతే స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం అవుతూ రావడమో ఇలా పలు కారణాలు రీత్యా డ్రై సీజన్ కంటిన్యూ అవుతూ వచ్చింది.

ఎక్కడి వరకో ఎందుకు ఈ ఏడాదిలోనే సంక్రాంతి సీజన్ తర్వాత మళ్ళీ ధురంధర్ 2, ఉస్తాద్ సినిమాలు వచ్చే వరకు మొత్తం చప్పగానే నడిచింది. ఇక అక్కడ నుంచి మళ్ళీ పెద్ది విడుదల వరకు షరా మామూలే.. కానీ పెద్ది తర్వాత మళ్ళీ పరిస్థితి పికప్ అయ్యి మొన్న ది ప్యారడైజ్ వరకు ఓకే అనిపించింది. కానీ ప్యారడైజ్ సాలిడ్ లాంగ్ రన్ సినిమాగా నిలవకపోవడంతో మళ్ళీ జనంలో ఇంట్రెస్ట్ లోపించినట్టు కనిపిస్తుంది.

ఇప్పుడు దసరా కానుకగా వస్తున్న జైలర్ 2, రణబాలి లాంటి సినిమాల విషయంలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్ బజ్ కనిపించడం లేదు. కానీ మళ్ళీ థియేటర్స్ కి జనాన్ని తీసుకొచ్చే పొటెన్షియల్ వీటికే ఉంది. దసరా హాలిడేస్ అడ్వాంటేజ్ తో వీటికి టాక్ పడితే సరే కానీ లేదంటే మళ్ళీ ఇక్కట్లు తప్పవు. సో ఏం జరుగుతుందో చూడాలి.

తాజా వార్తలు