నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ది ప్యారడైజ్, తన కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ సాధించి తనకి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా నాని మరో యువ దర్శకుడు సుజీత్ తో క్రేజీ యాక్షన్ చిత్రం ‘బ్లడీ రోమియో’ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పుడు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇలా లేటెస్ట్ గానే నాని ఇక నుంచి గ్యాంగ్స్టా మోడ్ లోకి దిగిపోయినట్టు కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రంలో నాని ఒక చెఫ్ గానే కాకుండా గ్యాంగ్స్టర్ గా కూడా కనిపించబోతున్నట్టు తెలిసిందే. మరి నాని ఇపుడు గ్యాంగ్స్టర్ గా ఈ అక్టోబర్ 16 లేదా 17 నుంచే సెట్స్ లోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి బ్లడీ రోమియోగా నాని అక్సదరగొట్టబోతున్నాడని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాదిలోనే విడుదల ఉండనుంది.
Gangsta Mode: ACTIVATED 💥💥
#BloodyRomeo 😎
— Bloody Romeo (@BloodyRomeoFilm) October 10, 2026


