సూపర్ స్టార్ కి “శ్రీదేవి సోడా సెంటర్” టీమ్ థాంక్స్!

Published on Aug 19, 2021 1:07 pm IST


సుధీర్ బాబు హీరోగా, ఆనంది హీరోయిన్ గా కరుణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ చిత్రం కి సంబంధించిన పాటలు, పోస్టర్, గ్లింప్స్ విడుదల అయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటం తో సినిమా పై భారీ అంచనాలను ఉన్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ మేరకు సూపర్ స్టార్ మహేష్ బాబు కి శ్రీదేవి సోడా సెంటర్ టీమ్ థాంక్స్ తెలిపింది. ఈ చిత్రానికి విజయ్ చిల్లా మరియు శశి దేవిరెడ్డీ లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 27 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :