ఊహించని ఎలిమెంట్స్ తో “శ్రీదేవి సోడా సెంటర్” ట్రైలర్.!

Published on Aug 19, 2021 10:02 am IST


తన లాస్ట్ సినిమా “వి” తో సాలిడ్ రెస్పాన్స్ అందుకున్న సుధీర్ బాబు దానికి కంప్లీట్ డిఫరెంట్ గా చేసిన అటెంప్ట్ “శ్రీదేవి సోడా సెంటర్” చిత్రం. ‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ కి రిలీజ్ అవుతుండగా ఈ చిత్రం తాలూకా థియేట్రికల్ ట్రైలర్ ని మేకర్స్ ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులు మీదుగా లాంచ్ చేశారు. మరి మహేష్ లాంచ్ చేసిన ఈ ట్రైలర్ డెఫినెట్ గా ప్రామిసింగ్ గా మరిన్ని అంచనాలు పెంచేదిగా ఉందని చెప్పాలి.

తన ఫస్ట్ సినిమా తోనే ఇంటెన్స్ హిట్ అందుకున్న దర్శకుడు కరుణ కుమార్ ఈ చిత్రానికి వచ్చేసరికి మరో కొత్త కథ కాకపోతే ఒక ప్లెజెంట్ ఎంటర్టైనర్ ని చేస్తున్నారని ఇప్పటి వరకు వచ్చిన టీజర్స్ పాటలు చూస్తే అర్ధం అయ్యింది. కానీ ట్రైలర్ చూసాక ఊహించని విధంగా ఉందనిపిస్తుంది. చాలా బలమైన ఎమోషన్స్ ని ఈ ట్రైలర్ లో చూపించడం గమనార్హం.

పలాస లో ఏ తరహా నిజమైన ఎమోషన్స్ ని ప్రాంతీయ విబేధాలను చూపించారో ఇందులో కూడా అలాంటివే మరింత బలంగా ఉండేలా అనిపిస్తుంది. ముఖ్యంగా అయితే ఈ ట్రైలర్ లో కనిపించిన సుధీర్ బాబు కంప్లీట్ డిఫరెంట్ సుధీర్ అని చెప్పాలి. ఇది వరకు తన డాన్సులు ఫైట్లు చూసాం కానీ ఈ చిత్రంలో తన నుంచి పరిపూర్ణమైన నటుడిని చూస్తాం అనిపిస్తుంది.

ట్రైలర్ లో చూపించిన కొన్ని సన్నివేశాల్లో చాలా మంచి ఎమోషన్స్ ని కనబరిచాడు.. మొత్తంగా మాత్రం ఈ చిత్రం కూడా ఒక ఇంటెన్స్ కంటెంట్ తోనే ఉన్నట్టు అనిపిస్తుంది. మణిశర్మ ఇచ్చిన సంగీతం ఆల్రెడీ హిట్ ట్రైలర్ లో కూడా బాగుంది. అలాగే షాందత్ సైనుద్దీన్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ కూడా బాగా కనిపిస్తుంది. ఇక 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన ఈ చిత్రం ఎలా ఉండనుందో తెలియాలి అంటే వచ్చే ఆగష్టు 27 వరకు ఆగాల్సిందే..

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :