ఈ నెలలోనే శ్రీకాంత్ అడ్డాల సినిమా ప్రకటన

ఈ నెలలోనే శ్రీకాంత్ అడ్డాల సినిమా ప్రకటన

Published on Jul 9, 2019 9:21 PM IST

‘బ్రహ్మోత్సవం’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మాణంలో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల నుండి నడుస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తోంది. స్క్రిప్ట్ పక్కాగ కుదరడంతో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే సినిమాపై అధికారిక ప్రకటన చేయనున్నారు నిర్మాత.

శ్రీకాంత్ అడ్డాల ఎప్పటిలాగే ఈ చిత్రంలో కూడా కుటుంబ విలువలకు పెద్ద పీఠ వేయడం జరిగింది. అంతేకాదు యువతను ఆకట్టుకునే ప్రేమ కథ కూడా ఇందులో ఉంటుందట. వచ్చే యేడాది సంక్రాంతికి ఈ సినినా విడుదలయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు ఎవరనే విషయాన్ని ఇంకా గోప్యంగానే ఉంచారు. సినిమా ప్రకటన రోజే వారి వివరాలు కూడా తెలిసే అవకాశాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు