‘ఎర్ర‌చీర‌` కోసం హీరో శ్రీ‌కాంత్ !

Published on Jul 1, 2019 12:05 am IST

`మ‌హాన‌టి` ఫేం బేబి సాయితేజ‌స్వీని, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రలను పోషిస్తున్న చిత్రం ఎర్రచీర. బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకం పై చెరువుపల్లి సుమన్‌ బాబు స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. హార‌ర్ యాక్షన్ స‌స్పెన్స్ ప్ర‌ధానంగా రూపొందుతున్న‌ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. ఈ చిత్రంలో శ‌తాధిక చిత్రాల హీరో శ్రీ‌కాంత్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు.

ఈ మధ్య హీరోగా సినిమాలు తగ్గించిన శ్రీకాంత్ ఇతర సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నారు. ఇక ఎర్ర చీర‌లో శ్రీ‌కాంత్ న‌టించ‌డం సినిమాకి ప్లస్ కానుంది. సినిమాలో శ్రీకాంత్ పాత్ర ఆస‌క్తిక‌రంగా ఉంటుందట.. క‌థ‌లో ఎంతో కీల‌క‌పాత్ర అని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో శ్రీ‌రాం, అలీ పాత్ర‌లు కూడా బాగా ఆక‌ట్టుకుంటాయట.

సంబంధిత సమాచారం :

More